జెరూసలేం : హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు ఆగటం లేదు. గురువారం ఖాన్ యూనస్‌లో రెండు చోట్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా.. ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
12 గంటల వ్యవధిలో మొత్తం 33 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా వైద్య అధికారులు మీడియాకు తెలిపారు. శరణార్థులు తలదాచుకున్న గుడారాలపై ఇజ్రాయెల్ బాంబింగ్ జరిపిందని, అందులో 16 మంది చనిపోయారని తెలిపారు.