ఆదివారం 31 మే 2020
National - May 09, 2020 , 15:27:13

మ‌ద్యం షాపులు బంద్ చేయాల‌న్న హైకోర్టు.. సుప్రీంకు వెళ్లిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం

మ‌ద్యం షాపులు బంద్ చేయాల‌న్న హైకోర్టు.. సుప్రీంకు వెళ్లిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం

చెన్నై: రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను నిలిపివేయాల‌ని మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. లాక్‌డౌన్ వేళ మ‌ద్యం దుకాణాల వ‌ద్ద మందుబాబులు సోష‌ల్ డిస్టాన్సింగ్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారని, అందుకే మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఆపేయాల‌ని మ‌ద్రాసు హైకోర్టు ఆదేశించింది. కేవ‌లం ఆన్‌లైన్‌లో మాత్ర‌మే మ‌ద్యాన్ని అమ్మాలంటూ హైకోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. అయితే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌ను.. సోమ‌వారం రోజున అత్యున్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ‌కు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. వాస్త‌వానికి గురువారం సుప్రీంకోర్టు కూడా ఓ పిల్‌పై స్పందిస్తూ.. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్యాన్ని ఆన్‌లైన్‌లో అమ్మే వెస‌లుబాటు చేయాల‌ని సూచించింది. logo