Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) అన్నారు. ఆయన మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
‘రామోజీ రావు మరణం అత్యంత విషాదకరం. ఆధునిక జర్నలిజానికి పితామహుడిగా నిలిచిన రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటు. ఆయన అనేక సంస్థలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారు. నిరంతరం ప్రజల మంచికోసం, సమాజహితం కోసం పరితపించి పని చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు. రామోజీ మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని తలసాని అన్నారు.
Also Read..
Ramoji Rao | రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు
Ramoji Rao | రేపు రామోజీరావు అంత్యక్రియలు
Ramoji Rao Death | రామోజీ నుంచి లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నా : మంచు విష్ణు