Ramoji Rao Death | రామోజీరావు మృతి పట్ల సినీనటుడు మంచు విష్ణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమన్నారు. రామోజీని కలిసిన ప్రతిసారీ ఎంతో లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేశారు. జర్నలిజం, వినోద రంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారని కొనియాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి అని తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు.
రామోజీరావు మృతి పట్ల సినీ నటుడు వెంటకేశ్ కూడా సంతాపం తెలిపారు. రామోజీ నిజమైన దార్శనికుడని, భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారని కొనియాడారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు.
‘రామోజీ రావు గారు మరణించారనే హృదయ విదారక వార్త విని బాధపడ్డా. ఆయన నా సినీ కెరీర్‌కు పునాది వేశారు. ఆయన నా గాడ్ ఫాదర్, నా స్ఫూర్తి. తెలుగు చిత్రపరిశ్రమను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి. ఆయన మృతి పరిశ్రకు తీరని నష్టం. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను’ అని నరేశ్ అన్నారు.
Also Read..
KCR | రామోజీ రావు మృతిపట్ల కేసీఆర్ సంతాపం
Ramoji Rao | అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
Balakrishna | రామోజీ రావు తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు : బాలకృష్ణ