Balakrishna | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతిపట్ల ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటంలేని మహారాజు అని అన్నారు. తెలుగులోనే కాకుండా దేశ పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారని కొనియాడారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారన్నారు. చిత్రసీమలో సైతం అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరించారన్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావుతో రామోజీకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైందని గుర్తు చేసుకున్నారు. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also Read..
KCR | రామోజీ రావు మృతిపట్ల కేసీఆర్ సంతాపం
Pawan Kalyan | అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన రామోజీ : పవన్‌కల్యాణ్
Ramoji Rao | అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు