హైదరాబాద్ : పత్రికాధిపతి రామోజీరావు (Ramoji rao) అస్తమయం పట్ల జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబానికి జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని తన పత్రిక ఈనాడు ద్వారా రామోజీ నిరూపించారని తెలిపారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ జన చైతన్యం కలగించారని, ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచారని ప్రశంసించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా మలిచారని పేర్కొన్నారు.