హైదరాబాద్: ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సింగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు.