ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 09:15:51

మ‌హిళా ఉద్యోగుల‌కు అద‌నంగా 12 రోజుల సెల‌వులు

మ‌హిళా ఉద్యోగుల‌కు అద‌నంగా 12 రోజుల సెల‌వులు

సూర‌త్‌: ‌గుజ‌రాత్‌లోని సూర‌త్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఓ డిజిట‌ల్‌ మార్కెటింగ్ కంపెనీ త‌న మ‌హిళా ఉద్యోగుల‌కోసం ఒక మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ది. కంపెనీలో ప‌నిచేస్తున్న మ‌హిళా ఉద్యోగుల‌కు ఏడాదిలో 12 రోజుల‌పాటు అద‌నంగా పిరియ‌డ్స్ సెల‌వులు మంజూరు చేసింది. సూర‌త్‌కు చెందిన భూతిక్ శేత్ 2014లో డిజిట‌ల్ మార్కెటింగ్ కంపెనీని ప్రారంభించారు. మొత్తం తొమ్మిది మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అందులో ఎనిమిది మంది మ‌హిళా ఉద్యోగులు ఉన్నారు. దీంతో వారికి 12 రోజులు అద‌నంగా సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈనేప‌థ్యంలో ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌ జొమాటో, ఐవీపాన‌న్ అనే కంపెనీ కూడా త‌న ఉద్యోగినుల‌కు అద‌న‌పు సెల‌వుల‌‌ను ప్ర‌క‌టించాయి. ఇవి వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపాయి.  

భార‌తీయ స‌మాజంలో రుతుస్రావంపై ఇప్ప‌టికీ నిషేధం ఉంద‌ని, ఇప్ప‌టికీ వివిధ ఆఫీసుల్లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌లు వాష్ రూంకు వెళ్లేట‌ప్పుడు చేతిలో బ్యాగ్ తీసుకెళ్తుంటార‌ని భూతిక్ శేత్‌ చెప్పారు. అందుకే ఆడ‌, మ‌గ మ‌ధ్య జీవ సంబంధ‌మైన వ్య‌త్యాసాన్ని అర్థం చేసుకుని పీరియ‌డ్స్ స‌మ‌యంలో మ‌హిళ‌లు అసౌక‌ర్యానికి గురికాకుండా తాము ఏడాదికి 12 రోజుల‌పాటు అద‌నంగా సెల‌వుల‌ను ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు.  


logo