Vivo X300 Ultra | వివో నుంచి ఎక్స్300 అల్ట్రా, ఎక్స్300 ఎఫ్ఈ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు వివరాలు
Vivo X300 Ultra : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. అవి ఒకటి వివో ఎక్స్300 అల్ట్రా. రెండోది వివో ఎక్స్300 ఎఫ్ఈ.
Vivo X300 Ultra : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. అవి ఒకటి వివో ఎక్స్300 అల్ట్రా. రెండోది వివో ఎక్స్300 ఎఫ్ఈ. ఈ రెండు ఫోన్లలోనూ కెమెరా చాలా ప్రత్యేకం. జీస్ భాగస్వామ్యంతో ఈ కెమెరాల్ని వివో తయారు చేసింది. ఒకటి వివో ఎక్స్300 అల్ట్రాలో 200 ఎంపీ కెమెరా ఉండగా, ఒకటి వివో ఎక్స్300 ఎఫ్ఈ ఫోన్లో 50 ఎంపీ కెమెరా ఉంది. మంచి క్వాలిటీ కెమెరా కావాలని కోరుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ నెల 14 నుంచి సేల్కు అందుబాటులో ఉంటుంది. దేశీయ మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్లలోని ఇతర ఫీచర్లు, ధర వివరాలివి.
వివో ఎక్స్300 అల్ట్రా
6.82 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆరిజన్ ఓఎస్6, 200 ఎంపీ కెమెరా, 200 ఎంపీ పెరిస్కోపిక్ సెన్సర్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8కే వీడియో రికార్డింగ్, 6,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 40 వాట్స్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 232 గ్రాముల బరువు, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, 16జీబీ+512జీబీ వంటి ఫీచర్లున్నాయి. ఎక్లిప్స్ బ్లాక్, విక్టరీ గ్రీన్ కలర్స్‌లో లభ్యం. ధర రూ.1,59,999. వివిధ కార్డులపై ఆఫర్లు, డిస్కౌంట్లు వర్తిస్తాయి.
వివో ఎక్స్300 ఎఫ్ఈ
6.31 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్ 5 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోపిక్ జూమ్ లెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆరిజన్ ఓఎస్6, 12జీబీ+256జీబీ, నాయర్ బ్లాక్, అర్బన్ ఆలివ్, లియాక్ పర్పుల్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం. 12జీబీ+512జీబీ. ధర రూ.79,999, రూ.89,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- India
- price
- vivo X300 Ultra
- X300 FE
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

