Suvendu Adhikari : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ (BJP) వేగాంగా పావులు కదుపుతోంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం (BJlLP) సమావేశమై సీనియర్ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. అనంతరం కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తాజాగా సువేందు అధికారి కోల్‌కతా (Kolkata) లోని లోక్‌భవన్ (Lok Bhavan) కు వెళ్లి గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు.
గవర్నర్‌ను కలిసిన సమయంలో సువేందు అధికారి వెంట బెంగాల్ బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సువేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అనుమితి ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 294 స్థానాలకుగానూ కమలం పార్టీ దాదాపు 200 సీట్లు గెలుచుకుని అధికారం దక్కించుకుంది. వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న టీఎంసీ ఈసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో 200కు పైగా సీట్లు గెలిచిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 100 సీట్లు కూడా నెగ్గలేకపోయింది.