చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో ప్రజంభనం సృష్టించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. (Vijay gets Governor’s nod) దీంతో శనివారం ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచిన టీవీకేకు కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, వీసీకే మద్దతు ప్రకటించాయి. దీంతో శుక్రవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిశారు. మెజారిటీ మార్కు అయిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి లభించింది. అయితే మూడు రోజుల్లో గవర్నర్‌ను విజయ్ కలవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
కాగా, శనివారం ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తున్నది.
Also Read:
small error delayed Vijay’s CM Oath | విజయ్ చిన్న పొరపాటు.. సీఎం ప్రమాణ స్వీకారానికి ఆలస్యమైందా?
TVK secures magic number | టీవీకేకు వీసీకే, వామపక్షాల మద్దతు.. మ్యాజిక్ నంబర్ 118 సాధించిన విజయ్
VCK slams TVK | వాట్సాప్ ద్వారా మద్దతు కోరిన టీవీకే.. అహంకారమని వీసీకే విమర్శ