TVK secures magic number | టీవీకేకు వీసీకే, వామపక్షాల మద్దతు.. మ్యాజిక్ నంబర్ 118 సాధించిన విజయ్
TVK secures magic number | తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరపడనున్నది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్‌తోపాటు వీసీకే, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ నంబర్ 118ను ఆయన సాధించారు.
చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరపడనున్నది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్‌తోపాటు వీసీకే, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ నంబర్ 118ను ఆయన సాధించారు. (TVK secures magic number ) ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 108 స్థానాల్లో టీవీకే గెలిచింది. తొలుత తన ఐదుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న సీపీఐ, సీపీఐ(ఎం)లు కూడా అంతర్గత సమావేశాల తర్వాత టీవీకేకు శుక్రవారం మద్దతు తెలిపాయి. ఇద్దరు ఎమ్మెల్యేలున్న విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) కూడా విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కు టీవీకేకు లభించింది.
కాగా, కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ సన్నద్ధమయ్యారు. ఈ పార్టీల మద్దతు లేఖలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. దీనికి గవర్నర్ సమ్మతిస్తే ప్రభుత్వం ఏర్పాటుపై విజయ్ దృష్టిసారిస్తారు. దీంతో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడనున్నది.
Also Read:
VCK slams TVK | వాట్సాప్ ద్వారా మద్దతు కోరిన టీవీకే.. అహంకారమని వీకేసీ విమర్శ
Tamil Nadu | డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తుపై ప్రచారం.. స్టాలిన్‌పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

