Supriya Sule | మహారాష్ట్ర రాజకీయాల్లో బారామతి (Baramati ) నియోజకవర్గం సంచలనంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో వదినా మరదళ్లు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంపీగా కొనసాగుతున్న శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే (Supriya Sule)పై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) పోటీ చేస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విషయాన్ని అజిత్ పవార్ కూడా కొద్ది రోజుల క్రితం పరోక్షంగా ప్రకటించారు. బారామతి నుంచి కొత్త వ్యక్తి పోటీలో ఉంటారని, ఆశీర్వదించాలని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవార్ కుటుంబంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వదినా మరదళ్లు తొలిసారి తారసపడ్డారు.
మహా శివరాత్రి రోజు ఓ ఆలయంలో సుప్రియా సూలే , అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు (Hug Each Other). శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా ఇద్దరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బారామతి నియోజకవర్గం నుంచి వీరిద్దరూ ప్రత్యర్థులుగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వదినా మరదళ్ల ఆప్యాయ పలకరింపు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆలయంలో వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Maharashtra: NCP (SCP) MP Supriya shares a hug with Ajit Pawar’s wife Sunetra Pawar while going for darshan at Kamleshwar Temple in Jalochi village in Baramati tehsil. (8.03) pic.twitter.com/FPcKT5ojsB
— ANI (@ANI) March 9, 2024
Also Read..
Hardeep Singh Nijjar | వెలుగులోకి ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దృశ్యాలు
AP Politics | అమిత్‌షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. ఎన్డీఏలోకి టీడీపీ..!
AP Politics | టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుపై ఎంపీ రఘు రామకృష్ణ కీలక వ్యాఖ్యలు