AP Politics | న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీని ఓడించేందుకు టీడీపీ – జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు బీజేపీతో కూడా జతకట్టేందుకు గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను చంద్రబాబు, పవన్ కళ్యాన్ కలిసి పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘు రామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుపై వీలైనంత త్వరగా ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. మరో 20 – 30 నిమిషాల్లోనే పొత్తుపై స్పష్టత వస్తుందన్నారు. పార్టీ కేడర్‌తో సహా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని రఘు రామకృష్ణ రావు స్పష్టం చేశారు.
#WATCH | Suspended YSRCP leader K Raghu Rama Krishna Raju says, “The alliance will be announced very shortly, maybe in the next 20-30 minutes…Everyone will be happy, including the party people…” https://t.co/fNi2X53G1A pic.twitter.com/p1UyDjgT2j
— ANI (@ANI) March 9, 2024