ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్నారు ఎన్టీఆర్. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని టాక్. ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ ఫారెస్ట్ సెట్‌ని నిర్మించి, వందమంది ఫైటర్లతో ఆ సెట్లోనే యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్‌నీల్ చిత్రీకరించారని వినికిడి.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గారు. ఈ మధ్య ఆయన లుక్ బయటకు రావడంతో అభిమానులే కాక, సగటు ప్రేక్షకుడు సైతం ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రశాంత్‌నీల్ ‘డ్రాగన్’ కోసమే ఎన్టీఆర్ ఇలా తగ్గారనీ, ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్లే అలా తగ్గాల్సొచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారని ఈ సందర్భంగా వారంటున్నారు. ఇదిలావుంటే.. ‘డ్రాగన్’ నెక్ట్స్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత మొదలు కానున్నదట. ఈ ఏడాది జూన్ 25న సినిమా విడుదల చేయనున్నట్టు సమాచారం.