AP Politics | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శనివారం భేటీ అయ్యారు. అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ కొనసాగింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. ఏపీ, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.
#WATCH | TDP chief and former Andhra Pradesh CM N Chandrababu Naidu arrived at the residence of Union Home Minister Amit Shah, in Delhi.
Discussions on alliance and seat-sharing likely to be held between the two leaders. pic.twitter.com/IoDrUNKUjY
— ANI (@ANI) March 9, 2024