Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ గురించి ఒక సంచలన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి హింట్ ఇచ్చారు.
ఇటీవల ఒక బెంగాలీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిథున్ చక్రవర్తి, తన రాబోయే చిత్రాల గురించి మాట్లాడుతూ ‘జైలర్ 2’ ప్రస్తావన తెచ్చారు. ఈ సినిమాలో నటీనటుల పేర్లను చెబుతూ.. “మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్” అని షారుఖ్ పేరును కూడా చేర్చారు. దీంతో ‘జైలర్ 2’లో షారుఖ్ ఖాన్ నటిస్తున్నారనే విషయం దాదాపు ఖరారైందని అభిమానులు సంబరపడుతున్నారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్ కలిసి గతంలో ‘రా వన్’ (Ra.One) సినిమాలో ఒక చిన్న సీన్ కోసం స్క్రీన్ పంచుకున్నారు. ఇప్పుడు ఒక పూర్తి స్థాయి స్పెషల్ రోల్లో వీరు కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో రజనీకాంత్, మిథున్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు, దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
#mithunchakraborty Confirmed #SRK‘s Cameo in #Jailer2 In His Latest 🎙️
Reporter: Which Gener Movies Do You Like Most?#mithunchakraborty : You Can’t Decide Like That, In Jailer2 Everyone Agreed To Work, Like Rajnikant, Mohanlal, #ShahRukhKhan , Ramya Krishnan, Shivraj Kumar. pic.twitter.com/RcYoIStyi1
— 𓀠 (@Worship_SRK) December 25, 2025