కేతేపల్లి, డిసెంబర్ 25 : శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న యేసుక్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేతేపల్లి మండలంలోని రాయపురం చర్చి వద్ద నిర్వహించిన వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరినీ ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు.