Pavel Durov | టెలిగ్రాం ఫౌండర్ (Telegram Founder) పావెల్ దురోవ్ (Pavel Durov) సంచలన ప్రకటన చేశారు. తన వీర్యం (Sperm) ద్వారా పిల్లల్ని కంటే ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ప్రకటించారు. అంతేకాదు, అలా పుట్టిన పిల్లలందరికీ తన ఆస్తిలో సమాన వాటా ఇస్తానని హామీ ఇచ్చారు.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. 37 ఏళ్లలోపు మహిళలు తన వీర్యం ఉపయోగించుకొని ఐవీఎఫ్ (IVF) చేయించుకుంటే అందుకు అవసరమైన ఖర్చు మొత్తం తానే భరిస్తానని దురోవ్ ప్రకటించారు. ఇప్పటికే స్పెర్మ్ డొనేషన్ ద్వారా తాను 12 దేశాల్లో 100 మంది పిల్లలకు తండ్రిని అని పేర్కొన్నారు. అంతేకాదు, తన గత రిలేషన్షిప్స్ ద్వారా ఆరుగురు సంతానం కలిగారని వెల్లడించారు. పిల్లలందరికీ తన 17 బిలియన్ డాలర్ల ఆస్తిలో సమాన వాటా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ పిల్లలందరికీ తన ఆస్తిలో సమాన వాటా దక్కుతుందని వీలునామాలో దురోవ్ పేర్కొన్నారు. దురోవ్ వీర్యం మాస్కోలోని ఆల్ట్రావిటా క్లినిక్‌లో అందుబాటులో ఉంది.
Also Read..
Blast At Mosque | మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురు మృతి