Rasamayi Balakishan | తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి మాటలు చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ భవన్లో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నతీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం. కేసీఆర్ హయాంలో పల్లె, పల్లె పరిశుభ్రతతో కనిపించేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన స్థానాలన్నీ మావే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. కొత్తగా గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి రండ భాష మాట్లాడాడు. పాన్ షాప్ దగ్గర గుట్కా తినేవాడి కంటే వల్గర్‌గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచిందో చెప్పు రేవంత్ రెడ్డి.
మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపో, మాపో కర్ణాటక రాష్ట్రంలో అధికారం కోల్పోయేలా ఉంది. కేసీఆర్ లాంటి పెద్దమనిషి గురించి నీచమైన భాష మాట్లాడాడు. మస్తాన్ మటన్ షాప్ దగ్గర కేసీఆర్ కు ఉద్యోగం ఇస్తా అని అహంకారంతో మాట్లాడుతవా.. ?
అసలు నీ బ్రతుకెంత రేవంత్ రెడ్డి. కేసీఆర్ కాలి గోటికి సరిపోవు రేవంత్ రెడ్డి. నువ్వా రేవంత్ రెడ్డి కేసీఆర్‌పైన మాట్లాడేది. పేగులు మెడలో వేసే ఎక్స్ పర్ట్ రేవంత్ రెడ్డి. ఉద్యమకారుడు హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయినా నీది రేవంత్ రెడ్డి. నీకంటే ముందు హరీష్ రావు మంత్రి అయ్యాడు. తెలంగాణ ఉద్యమ బుల్లెట్ హరీష్ అన్న. హరీష్ అన్న గురించా నువ్వు మాట్లాడేది రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
ఎన్ఆర్ఐలను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు..
హరీష్ రావు వ్యక్తిత్వం గురించి చూడాలంటే తల పైకి ఎత్తి చూడాలి. కేటీఆర్ తెలంగాణ హీరో, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో రేవంత్ రెడ్డి .అమెరికాలో ఉండే రేవంత్ రెడ్డి తమ్ముడు బాత్రూంలు కడుగుతున్నాడా..? అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు. కేటీఆర్ ఆంధ్రలో చదువుకున్నాడు, తప్పు ఏముంది. నీ బిడ్డను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎందుకు ఇచ్చావు మరి. సర్వం ఆంధ్ర అల్లుడికి కట్టబెట్టావు కదా.
తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికి తెలంగాణ తల్లి శోభమ్మ. అలాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వా అని అంటవ రేవంత్ రెడ్డి. నీలాంటి కుసంస్కారం గురించి ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్