Supriya Sule | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఈ మధ్య విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎయిర్ ఇండియాపై మండిపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఎయిర్ ఇండియా సేవలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) సైతం అసహనం వ్యక్తం చేశారు.
ఎయిర్ ఇండియా విమానాలు సమయానికి (Flight Delay) రావట్లేదని ఆమె ఆరోపించారు. తాను గంటలకుపైగా వేచి ఉండాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేం ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తాము.. అయినప్పటికీ విమానాలు సమయానికి రావు. ఆలస్యం కారణంగా పిల్లలు, సీనియర్ సిటిజన్స్, నిపుణులు ఇలా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన AI0508 విమానంలో ప్రయాణించా. దీని కోసం గంట 19 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి. విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలి’ అని ఆమె ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
I was travelling on Air India flight AI0508, which was delayed by 1 hour and 19 minutes — part of a continuous trend of delays affecting passengers. This is unacceptable.
Urging Hon’ble Civil Aviation Minister @RamMNK to enforce stricter regulations to hold airlines like… https://t.co/ydqw9NJzcR
— Supriya Sule (@supriya_sule) March 21, 2025
విరిగిపోయిన సీటు ఇచ్చారు..
విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Chouhan) గత నెల ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. ప్రయాణికుల నుంచి పూర్తి చార్జీలను వసూలు చేసి వారికి విరిగిపోయిన సీట్లను కేటాయించడాన్ని అనైతిక చర్యగా ఆయన అభివర్ణించారు. విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనికి వెంటనే ఎయిర్ ఇండియా స్పందించి మంత్రికి క్షమాపణలు చెప్పింది. ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. తన అనుభవాన్ని చౌహాన్ వివరిస్తూ పూసాలో జరగనున్న రైతుల ప్రదర్శన శాలను, ప్రారంభించి కురుక్షేత్రలో ప్రకృతి సేద్యం మిషన్ సమావేశంలో పాల్గొనేందుకు తాను భోపాల్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణించానని తెలిపారు. తనకు కేటాయించిన సీటులో కూర్చోగా అది విరిగిపోయి, కుంగిపోయి ఉండడాన్ని గమనించానని ఆయన చెప్పారు.
ఇక ఆ తర్వాత బీజేపీ నేత జైవీర్ షెర్గిల్ సైతం ఎయిర్ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు ‘చెత్త ఎయిర్‌లైన్స్’ (WORST AIRLINES) విభాగంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. సంస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు. ‘చెత్త ఎయిర్‌లైన్స్ విభాగంలో ఎయిర్ ఇండియా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విభాగంలో ఎయిర్‌లైన్స్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. విరిగిన సీట్లు, చెత్త సిబ్బంది, దయనీయమైన గ్రౌండ్ సపోర్ట్ స్టాఫ్..’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Also Read..
Delimitation | డీలిమిటేషన్‌పై సమరం.. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం
India | అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి.. విద్యార్థులకు భారత్ కీలక సూచన
You tube| యూట్యూబ్ చూసి తన కడుపు కోసి సర్జరీ చేసుకున్న మహానుభావుడు