Arvind Kejriwal | మద్యం పాలసీకి సంబంధించి (Delhi Excise Policy Scam) సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ విచారణ చేపట్టింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణ జరపింది. కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 10న తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. దీంతో కేజ్రీ మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో కేజ్రీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ.. ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Supreme Court reserves order on the plea filed by Delhi Chief Minister Arvind Kejriwal seeking bail in the CBI corruption case stemming from the alleged excise policy scam.
— ANI (@ANI) September 5, 2024
Also Read..
Aerial Survey | విజయవాడ నగర ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఏరియల్ సర్వే
Nayab Singh Saini | అవినీతితో జేబులు నింపుకోవడమే కాంగ్రెస్ అజెండా : హరియాణ సీఎం