అమరావతి : ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా అతలకుతలమైన విజయవాడ (Vijayawada) నగరాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ (Union Minister Shivaraj Singh) గురువారం ఏరియల్ సర్వే (Aerial Survey ) నిర్వహించారు. బూడమేరకు గండ్లుపడిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో కలిసి పరిశీలించారు. ఇతర ముంపు ప్రాంతాలనూ కేంద్ర మంత్రి పరిశీలించారు.
మరో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrashekar) గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో జరిగిన వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి ప్రభుత్వం ఆదుకుంటామని మాట్లాడారు. గత వైసీపీ పాలనలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల బాగోగుల గురించి పట్టించుకోకపోవడం వల్లే ప్రకృతి వైపరిత్యాలు వచ్చాయని ఆరోపించారు.
ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా ప్రతి సంవత్సరం సమీక్షలు నిర్వహించి పకడ్బందీగా నీటివనరులను కాపాడుతామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు నష్టపరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.