Govinda divorce rumours | బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవిందా (Govinda) తన భార్య సునీత అహుజా (Sunita Ahuja)తో విడాకులు తీసుకుంటున్నట్లు తెగ ప్రచారం (Govinda divorce rumours) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడాకుల అంశంపై దంపతుల న్యాయవాది లలిత్ బిందాల్ (Lalit Bindal) తాజాగా స్పందించారు. సునీత ఆరు నెలల క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, ఇప్పుడు ఇద్దరూ రాజీపడి కలిసి ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
గోవింద-సునీత జంటకు న్యాయవాది లలిత్ బిందాల్ సన్నిహిత మిత్రుడు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల అంశంపై ఆయన మాట్లాడారు. ‘సునీత విడాకుల కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఇద్దరూ రాజీకి వచ్చారు. సమస్యను పరిష్కరించుకొని కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే నూతన సంవత్సర వేడుకల కోసం నేపాల్‌కు వెళ్లారు. అక్కడ పశుపతినాథ్ మందిరంలో పూజలు కూడా చేశారు. ప్రస్తుతం ఇద్దరి మధ్యా ఎలాంటి విబేధాలూ లేవు. అంతా బాగానే ఉంది. జంటల మధ్య ఇలాంటివి జరగడం సహజమే. ఇప్పుడు ఇద్దరూ బలంగా ఉన్నారు. ఇకపై కలిసే ఉంటారు’ అని వివరించారు.
1987 మార్చి 11న పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 37 ఏండ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గోవిందా – సునీత అహుజా కొంతకాలంగా విడిగా జీవిస్తున్నారని, వారి వైవాహిక జీవితంలో తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని వార్తలు వచ్చాయి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా సునీత మాట్లాడుతూ.. తాను, గోవిందా వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నట్లు చెప్పారు.
అంతేకాదు, తాను ఒక ఫ్లాట్‌లో తన పిల్లలతో ఉంటుండగా, గోవిందా ఎదురుగా ఉన్న బంగళాలో నివసిస్తున్నారని వెల్లడించారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇక ఈ వార్తలపై గోవిందా క్లారిటీ కూడా ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన ఇంటికి వచ్చేవారంతా బిజినెస్ పనుల్లో భాగంగా.. సినిమా పనుల్లో భాగంగా వస్తున్నట్లు చెప్పారు. అంతేగాని విడాకుల కోసం కాదంటూ గోవిందా వెల్లడించారు.
Also Read..
AAP | జైభీమ్ అన్నందుకు సస్పెండ్ చేశారు.. అసెంబ్లీకి రానీకుండా అడ్డుకుంటున్నారు : ఆతిశీ