Maha Kumbh | కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్రాజ్ మహా కుంభ మేళా (Maha Kumbh Mela) శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. 45 రోజులపాటు జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక వేడుకలో దాదాపు 66 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ మహాకుంభమేళాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం (Maha Yagya) దిగ్విజయంగా ముగిసిందన్నారు.
महाकुंभ संपन्न हुआ…एकता का महायज्ञ संपन्न हुआ। प्रयागराज में एकता के महाकुंभ में पूरे 45 दिनों तक जिस प्रकार 140 करोड़ देशवासियों की आस्था एक साथ, एक समय में इस एक पर्व से आकर जुड़ी, वो अभिभूत करता है! महाकुंभ के पूर्ण होने पर जो विचार मन में आए, उन्हें मैंने कलमबद्ध करने का… pic.twitter.com/TgzdUuzuGI
— Narendra Modi (@narendramodi) February 27, 2025
భారతీయ ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెప్పారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా నిర్వహించడం అంత సులువు కాదన్నారు. అన్నిటినీ దాటుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని గంగా, యమునా, సరస్వతి మాతాలను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు ఏర్పాట్ల విషయం లోపాలున్నా, భక్తులెవరైనా అసౌకర్యానికి గురైనా అందుకు క్షమించాలని ప్రధాని కోరారు.
समाज के हर वर्ग और हर क्षेत्र के लोग इस महाकुंभ में एक हो गए। ये एक भारत श्रेष्ठ भारत का चिर स्मरणीय दृश्य करोड़ों देशवासियों में आत्मविश्वास के साक्षात्कार का महापर्व बन गया।
— Narendra Modi (@narendramodi) February 27, 2025
కాగా, జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు జరిగిన ఈ మేళాలో 66.21 కోట్ల మందికి పైగా పాల్గొని పుణ్య స్నానాలు చేశారు. ఇక ఆఖరి రోజు1.44 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్టు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఇది రికార్డులకెక్కింది. దేశ, విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ కుంభమేళాకు ప్రత్యక్షంగా హాజరు కాని భక్తులకు డిజిటల్ ఫొటో స్నానం చేయించడం విశేషం.
Also Read..
Kumbh Mela | వైభవంగా ముగిసిన కుంభ మేళా.. 66 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు..
AAP | జైభీమ్ అన్నందుకు సస్పెండ్ చేశారు.. అసెంబ్లీకి రానీకుండా అడ్డుకుంటున్నారు : ఆతిశీ