Bengaluru Traffic | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కస్టమర్‌కు ఆన్‌టైమ్‌కు పిజ్జా డెలివరీ చేసిన డోమినోస్ సిబ్బంది.. వీడియో
Bengaluru Traffic | వరుస సెలవుల కారణంగా బెంగళూరు (Bengaluru)లో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయిన విషయం తెలిసిందే. ఇంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ డోమినోస్ (Dominos) డెలివరీ సిబ్బంది మాత్రం ఆన్ టైమ్‌కి కస్టమర్‌కు పిజ్జా అందించి ( Pizza Delivery) నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నారు.
Bengaluru Traffic | వరుస సెలవుల కారణంగా బెంగళూరు (Bengaluru)లో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడ గంటల తరబడి నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటికి చేరాల్సిన విద్యార్థులు రాత్రి 8 అయినా ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఇంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ డోమినోస్ (Dominos) డెలివరీ సిబ్బంది మాత్రం ఆన్ టైమ్‌కి కస్టమర్‌కు పిజ్జా అందించి ( Pizza Delivery) నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నారు.
రిషివస్త్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఆన్లైన్లో డోమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేశాడు. అతడు ఇంటికి వెళ్లేలోపు పిజ్జా డెలివరీ అవుతుందని ముందుగా ఊహించాడు. అయితే, రద్దీ కారణంగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. ఇదే విషయాన్ని డెలివరీ బాయ్‌కు చెప్పాడు. కస్టమర్ల పరిస్థితి అర్థం చేసుకున్న డెలివరీ సిబ్బంది దయతో వ్యవహరించారు. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన రిషివస్త్కు ఆన్‌టైమ్‌లో పిజ్జా డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు డెలివరీ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz
— Rishivaths (@rishivaths) September 27, 2023
Also Read..
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 27వ ఘటన
Manipur Violence | మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. రంగంలోకి రాకేష్ బల్వాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

