Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 27వ ఘటన
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
యూపీ (UP)కి చెందిన తన్వీర్ అనే యువకుడు నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. తన తండ్రి మహ్మద్ హుస్సేన్, సోదరితో కలిసి కోటాలోని కున్హాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తన్వీర్ గత ఏడాది కాలంగా కోటాలో ఉంటూ శిక్షణ తీసుకోకుండానే స్వయంగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన్వీర్ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అతడి సోదరి తలుపుతట్టింది. అయినా లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో అనుమానం వచ్చి తలుపు బద్దలుకొట్టి లోపలికెళ్లి చూడగా తన్వీర్ ఉరేసుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏకంగా 9 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మొత్తంగా తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 27 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. రాజస్థాన్ పోలీస్ డేటా ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.
మరోవైపు విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో అప్రమత్తమైన రాజస్థానం ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగానే ఇటీవలే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం తగ్గడం లేదు.
Also Read..
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో అక్షయ్ కుమార్ కూల్ మీటింగ్.. వీడియో
iPhone 15 | వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు.. కంపెనీకి ఫిర్యాదుల వెల్లువ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

