iPhone 15 | వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు.. కంపెనీకి ఫిర్యాదుల వెల్లువ
iPhone 15 | అన్ని ఫోన్లకంటే యాపిల్ బ్రాండ్ ఐఫోన్లకు క్రేజ్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఐఫోన్ ప్రియులు కొత్త సిరీస్ ఫోన్లను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే భారత విపణిలోకి విడుదలైన ఐఫోన్ 15 (iPhone 15 ) సిరీస్ ఫోన్లను టెక్ ప్రియులు ఎగబడి కొన్నారు. అయితే, ఇప్పుడు ఆ ఫోన్లు విపరీతంగా వేడెక్కుతున్నట్లు వినియోగదారులు కంప్లెయింట్స్ చేస్తున్నారు.
iPhone 15 | అన్ని ఫోన్లకంటే యాపిల్ బ్రాండ్ ఐఫోన్లకు క్రేజ్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఐఫోన్ ప్రియులు కొత్త సిరీస్ ఫోన్లను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే భారత విపణిలోకి విడుదలైన ఐఫోన్ 15 (iPhone 15 ) సిరీస్ ఫోన్లను టెక్ ప్రియులు ఎగబడి కొన్నారు. అయితే, ఇప్పుడు ఆ ఫోన్లు విపరీతంగా వేడెక్కుతున్నట్లు వినియోగదారులు కంప్లెయింట్స్ చేస్తున్నారు.
ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మాక్స్ ( 15 Pro Max ) ఫోన్లు ఛార్జింగ్ పెట్టినా, కాసేపు మాట్లాడినా, ఏదైనా గేమ్స్, వీడియో చాట్ ఇలా ఫోన్ వినియోగించినప్పుడు కాసేపటికే అవి బాగా వేడెక్కుతోందని యూజర్స్ (Overheating Issue) చెప్తున్నారు. ఫోన్ వెనుకభాగం, టచ్ భాగాన్ని పట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని యాపిల్ యూజర్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, ఇలాంటి సమస్య ఎదురైనపుడు ఏంచేయాలనే విషయంపై గతంలో కంపెనీ పలు సూచనలు చేసింది. తాజా సమస్యకు ఆ సూచనలు ఫాలో కావాలంటూ యూజర్స్‌కు యాపిల్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ చెబుతోందట. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటెన్సివ్ యాప్ లను వాడుతున్నపుడు, ఛార్జింగ్ పెట్టినపుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేస్తున్నపుడు ఈ సమస్య ఎదురవుతుంది.
కాగా, ఐఫోన్ కొత్త 15 సిరీస్ ఫోన్లను సంస్థ ఈ నెల 22వ తేదీన భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 15 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లతో పోల్చితే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు కీలక అప్ గ్రేడ్స్ చేసింది ఆపిల్. 48 మెగా పిక్సెల్ కెమెరా, యూఎస్బీ-సీ పోర్టు, కొత్త చిప్ సెట్, డైనమిక్ ఐలాండ్ తో పాటు మరిన్ని మార్పులు చేసింది. లుక్ కాస్త సేమ్ కన్పిస్తున్నా, ఫీచర్లు, పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఇంకా బెటర్ గా ఉండనుంది. ఇక ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో, పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ బేస్ స్టోరేజీ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 కాగా, 15 ప్లస్ ధర రూ. 89,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,34,900 నుంచి ప్రారంభం కానుండగా, 15 ప్రొ మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ. 1,59,900గా ఉంది.
Also Read..
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Pakistan Cricket Team | హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. వీడియో వైరల్
Congress MLA | డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

