Congress MLA | డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..
డ్రగ్స్ సంబంధిత కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను (Sukhpal Singh Khaira) పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఛండీగఢ్‌లోని సెక్టార్ 5లో ఉన్న ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఛండీగఢ్: డ్రగ్స్ సంబంధిత కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను (Sukhpal Singh Khaira) పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఛండీగఢ్‌లోని సెక్టార్ 5లో ఉన్న ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రొపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, అరెస్టు సందర్భంగా ఎమ్మెల్యే తీవ్రంగా ప్రతిఘటించారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాధానికి దిగారు. ఆ కేసును సుప్రిం కోర్టు ఎప్పుడో కొట్టేసిందని చెప్పారు.
ఖైరా పంజాబ్‌లోని భోలత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనపై 2015, మార్చి నెల జలాలాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసు నమోదుచేశారు. ఇదే కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అనంతరం వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిని దోషులుగా తేల్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

