Kerala | కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలను వర్షం ముంచెత్తింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
భారీ వర్షానికి పట్టాలపైకి భారీగా నీరు చేరుతోంది. కేరళలోని వలథోల్ నగర్ – వడ కంచెరి (Valathol Nagar-Wadakancheri) మార్గంలో పట్టాలపై నుంచి వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది (water flow on track). దీంతో అప్రమత్తమైన స్టేషనరీ వాచ్మెన్ వెంటనే ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న ఎర్నాకులం – కన్నూర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, తిరునెల్వేలి – పాలక్కాడ్ పాలరువి ఎక్స్ప్రెస్, తిరువనంతపురం – షోరనూర్ వేనాడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు పాక్షికంగా రద్దు చేశారు.
#WATCH | Kerala: Stationary watchman stopped train no. 16526 between Vallathol Nagar-Wadakkanchery of Trivandrum division due to heavy rain & water flow on track.
The following trains are partially cancelled today due to heavy water logging reported between Valathol Nagar and… pic.twitter.com/L2Cuye0dE4
— ANI (@ANI) July 30, 2024
వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి
కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడ్డ 20 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Also Read..
Landslides | కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. 19 మంది దుర్మరణం
Howara-CSMT Express | పట్టాలు తప్పిన హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్.. ఇద్దరు మృతి
Union Govt | కేంద్రం అప్పులు @ 185 లక్షల కోట్లు.. తెలంగాణ అప్పులు నియంత్రణలోనే..