Union Govt | కేంద్రం అప్పులు @ 185 లక్షల కోట్లు.. తెలంగాణ అప్పులు నియంత్రణలోనే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.185 లక్షల కోట్లకు చేరవచ్చని నరేంద్రమోదీ సర్కారు అంచనా వేసింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 56.8 శాతానికి సమానమని తెలిపింది.
- ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 14 లక్షల కోట్లు పెరగొచ్చని అంచనా
- జీడీపీలో 56.8 శాతానికి సమానం
- లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వెల్లడి
- కేంద్ర సర్కారుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అప్పులు తక్కువే
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలతో కలిపి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.185 లక్షల కోట్లకు చేరవచ్చని నరేంద్రమోదీ సర్కారు అంచనా వేసింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 56.8 శాతానికి సమానమని తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉన్నదని, ఇది జీడీపీలో 58.2 శాతానికి సమానమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వరల్డ్ ఔట్లుక్ అంచనాల ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి స్థిర ధరల వద్ద దేశ జీడీపీ 3.57 లక్షల డాలర్లకు (రూ.2,98,91,859 కోట్లకు) చేరినట్టు తెలిపారు. స్థిర ధరల వద్ద ప్రైవేట్ తుది వినిమయ వ్యయం (పీఎఫ్‌సీఈ) వృద్ధి రేటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా, గత ఆర్థిక సంవత్సరంలో 4 శాతంగా ఉన్నది.
తెలంగాణ అప్పులు నియంత్రణలోనే..
కేంద్రం నుంచి సాయం అందకపోయినా.. కొత్త రాష్ట్రమైనప్పటికీ రుణాలను పరిమితంగానే తీసుకొన్నది తెలంగాణ. జీఎస్డీపీతో పోలిస్తే అతి తక్కువ అప్పులు చేస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఉండటమే దీనికి నిదర్శనం. పెద్ద రాష్ర్టాల సూచీలో జీఎస్డీపీలో అప్పుల పరంగా తెలంగాణ కిందినుంచి ఐదో స్థానంలో ఉండగా, జీఎస్డీపీలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ర్టాలుగా పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ జీఎస్డీపీ రూ.14.64 లక్షల కోట్లు ఉండగా, ఇందులో అప్పుల వాటా 23.8 శాతం. ఇక, ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కానీ, కేంద్రం అప్పులు జీడీపీలో 56 శాతానికి పైగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. కేంద్రంతో పోల్చి చూసినా.. తెలంగాణ చేసిన అప్పుడు నియంత్రణలోనే ఉన్నాయని దీన్నిబట్టి అర్థమవుతున్నది. అయినప్పటికీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని రేవంత్ సర్కారు.. అప్పులు పరిమితంగానే చేసినప్పటికీ గత బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తుండటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

