స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబర్ 20 : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అధికారులు దౌర్జన్యానికి దిగారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు రెండు రోజుల క్రితం స్పీకర్‌కు తెలిపిన నేపథ్యంలో గులాబీ శ్రేణులు శనివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో స్వాగత ఫెక్ల్సీని ఏర్పాటుచేశారు. అయితే మున్సిపల్ అధికారులు ఈ ఫ్లెక్సీని తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు ఇటీవల స్పీకర్‌కు స్పష్టంచేసినందున శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎమ్మెల్యే కడియం హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫొటోతో కలిపి స్వాగతం పలుకుతూ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు.
మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ సిబ్బందితో వచ్చి ఫ్లెక్సీ ఎందుకు ఏర్పాటు చేశారని, వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఫ్లెక్సీ తొలగించారు. 15మందిని బీఆర్ఎస్ నాయకులను స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిరసన తెలిపారు. మాజీ జడ్పీటీసీ రవి, కుడా మాజీ డైరెక్టర్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.