South Central Railway | సంక్రాంతికి (Sankranti festival season) సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్‌న్యూస్ చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి (07041) మధ్య జనవరి 4, 11, 18 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి-సికింద్రాబాద్ (07042) మధ్య జనవరి 5, 12, 19 తేదీల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. అలాగే హైదరాబాద్-గోరఖ్‌పూర్ (07075) మధ్య జనవరి 9, 16, 23 తేదీల్లో, గోరఖ్‌పూర్-హైదరాబాద్ (07076) మధ్య జనవరి 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
అదేవిధంగా మచిలీపట్నం-అజ్మీర్ (07274) మధ్య ఈ నెల 21న, అజ్మీర్-మచిలీపట్నం (07275) మధ్య ఈ నెల 28న కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్ జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భాని, పర్టూర్, నాగర్సోల్, మన్మాడ్, భుసావల్, ఖండ్వా, భోపాల్, ఉజ్జయిని, రత్లాం, భిల్వారా తదితర స్టేషన్లలో ఆగుతాయి.
Also Read..
Air Pollution | కాలుష్య కోరల్లో ఢిల్లీ.. పడిపోయిన దృశ్యమానత.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ
Lionel Messi: కోల్‌కతా చేరుకున్న మెస్సి.. స్టార్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం