Jemima Goldsmith | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ (Jemima Goldsmith) బహిరంగ లేఖ రాశారు. జైల్లో నిర్బంధంలో ఉన్న తన భర్త ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి ఎక్స్‌లో తాను చేస్తున్న పోస్టులను అణచివేస్తున్నారని ఆరోపించారు. పాక్ అధికారులు ఇమ్రాన్ ఖాన్ పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి తాను చేస్తున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని తెలిపారు.
తన ఖాతాలో అమలవుతున్న విజిబిలిటీ ఫిల్టరింగ్ను సరిచేయాలని మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్‌లోనే జెమీమా గోల్డ్‌స్మిత్ ఓ పోస్టు పెట్టారు. గత 22 నెలలుగా చట్టవిరుద్ధంగా ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రిని కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు నా ఇద్దరు కుమారులకు పాక్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. జైల్లో ఇమ్రాన్ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి ‘ఎక్స్’ మాధ్యమం తప్ప తమకు మరో మార్గం లేదని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. కానీ పాక్ సహా ప్రపంచ వ్యాప్తంగా తన పోస్టుల పరిధి దాదాపు సున్నాకు తగ్గించేశారని ఆమె ఆరోపించారు. ఈ పోస్ట్‌ను మస్క్‌కు ట్యాగ్ చేశారు.
Also Read..
Air Pollution | కాలుష్య కోరల్లో ఢిల్లీ.. పడిపోయిన దృశ్యమానత.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ
Watch: ఎయిర్‌పోర్ట్‌లోకి పరుపుతో ప్రయాణికుడు.. ఇండిగో విమానాల ఆలస్యంపై నెటిజన్ల సెటైర్లు
Watch: మత్తులో యువకులు హంగామా.. స్కూల్ బస్సును అడ్డుకుని బాలికను దించాలని బలవంతం