Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్య కోరల్లో (Air Pollution) అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా రాజధాని నగరంలో కాలుష్యం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. శనివారం కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రస్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Central Pollution Control Board) ప్రకారం.. శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 18 మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైగానే నమోదయ్యాయి. మరోవైపు నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో దృశ్యమానత పడిపోయింది. కొన్ని మీటర్ల దూరంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పొగమంచు విమాన, రైలు రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport) కీలక అడ్వైజరీ జారీ చేసింది.
ఇవాళ ఢిల్లీలో ఓవరాల్ ఏక్యూఐ 387గా నమోదైంది. వజీర్‌పూర్‌లో అత్యధికంగా ఏక్యూఐ లెవెల్స్ 443గా నమోదయ్యాయి. ఆ తర్వాత జహంగీర్‌పురిలో 439, వివేక్ విహార్‌లో 437, రోహిణి, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 434 చొప్పున, అశోక్ విహార్‌లో 431, సోనియా విహార్, డీటీయూలో 427 చొప్పున, నరేలాలో 425, బవానా ప్రాంతంలో 424, నెహ్రూ నగర్లో 421, పట్పర్గంజ్లో 419, ఐటీవోలో 417, పంజాబీ బాగ్‌లో 416, ముండ్కా ప్రాంతంలో 415, బురారీ క్రాసింగ్ వద్ద 413, చాందినీ చౌక్ ఏరియాలో 412, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ ప్రాంతంలో 401గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. ఎన్సీఆర్ ప్రాంతంలోనూ వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. ఘజియాబాద్, నోయిడాలో ఏక్యూఐ స్థాయిలు 422గా నమోదయ్యాయి.
వాయు కాలుష్యానికి తోడు నగరంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో దృశ్యమానత పడిపోయింది. దీంతో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. విజిబిలిటీ పడిపోయినప్పటికీ విమాన రాకపోకలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తెలిపింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. మరోవైపు ఉత్తర భారతం అంతటా సీజన్లో మొదటిసారిగా దట్టమైన పొగమంచు ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ పొగమంచు పరిస్థితులు ఏర్పడ్డాయి. యూపీ, పంజాబ్‌లో విజిబిలిటీ 50 మీటర్లకంటే తక్కువగా నమోదైంది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
Also Read..
Space Tourism | అంతరిక్షంలో కమర్షియల్ హోటల్.. అందులో రెస్టారెంట్లు, జిమ్‌లు, సినిమా హాళ్లు కూడా!
కేంద్ర మాజీ మంత్రి శివ్‌రాజ్ కన్నుమూత