లాతూర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, పంజాబ్ మాజీ గవర్నర్ శివ్‌రాజ్ పాటిల్ శుక్రవారం కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యంతో లాతూర్‌లోని తన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. లాతూర్ లోక్‌సభ నుంచి ఆయన ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1991-96 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. కేంద్రంలో హోం, రక్షణ, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాల మంత్రిగా వ్యవహరించారు. ముంబైలో 11/26 ఉగ్రదాడి తర్వాత కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు.