కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి (Lionel Messi).. భారత్ చేరుకున్నాడు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2.26 నిమిషాలకు ఆయన కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. గోట్ ఇండియా టూరులో భాగంగా మెస్సి .. భారత్‌కు వచ్చాడు. కోల్‌కతా విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఇంటర్నేషనల్ అరైవల్స్‌కు చెందిన గేట్ 4 వద్ద వేల సంఖ్యలో జనం గుమ్మిగూడారు. మెస్సి.. మెస్సి అంటూ నినాదాలు చేశారు. తమ ఫోన్లతో స్టార్ ప్లేయర్ ఫోటోలు, వీడియోలు తీశారు. భారీ భద్రత మధ్య వీఐపీ గేట్ ద్వారా మెస్సి బయటకు వెళ్లాడు. తన టోటి జట్టు సభ్యులు లూయిస్ సురేజ్, అర్జెంటీనా టీమ్మేట్ రోడ్రిగో డీ పౌల్ కూడా ఉన్నారు. రాబోయే 72 గంటల పాటు మెస్సి బృందం ఇండియాలోనే గడపనున్నది. కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీల్లోనూ మెస్సి టూర్ చేయనున్నాడు. సోమవారం రోజు ప్రధాని నరేంద్ర మోదీని అర్జెంటీనా ప్లేయర్ మెస్సి కలవనున్నారు.
అయితే కోల్‌కతా విమానాశ్రయంలో అభిమానులకు నిరాశ ఎదురైంది. భారీ జనం వల్ల అతన్ని భద్రత మధ్య తీసుకెళ్లారు. ఉదయం 3.30 నిమిషాలకు బ్యాక్ గేటు ద్వారా అతన్ని హోటల్‌కు తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది మాత్రమే అతన్ని చూసే అదృష్టం కలిగింది. హయ్యత్ రీజెన్సీ హోటల్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. మెస్సి.. మెస్సి అంటూ అరిచారు. రూమ్ నెంబర్ 730 లోకి మెస్సి చెకిన్ అయ్యాడు. అతను ఉంటున్న ఏడో అంతస్తు సూట్‌ను పూర్తిగా సీల్ చేశారు.
సాల్ట్ లేక్ స్టేడియంలో ఉదయం జరిగే కార్యక్రమంలో మెస్సి పాల్గొంటాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతాడు. మోహన్ భగాన్ మెస్సి ఆల్ స్టార్స్ వర్సెస్ డైమెండ్ హార్బర్ మెస్సి ఆల్ స్టార్స్ మ్యాచ్‌లో మెస్సి ఆడుతాడు.ఇరు జట్ల ఆటగాళ్లతో మెస్సి ముచ్చటిస్తాడు. సంతోష్ ట్రోఫీ గెలిచిన జట్టుకు సత్కారం, పిల్లలతో మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటాడు. సీఎం మమతా బెనర్జీతో పాటు షారూక్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లేక్ టౌన్లో ఉన్న 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్‌గా మెస్సి ప్రారంభిస్తారు. మధ్యామ్నం 2 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడుతాడు.
2AM CROWD IN KOLKATA TO SEE LEO MESSI. pic.twitter.com/SsPCrVV2Rn
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2025