Sana Ganguly | కోల్కతా : మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ( Sourav Ganguly ) కుమార్తె సనా(Sana Ganguly )కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సనా ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటన బెంగాల్ రాజధాని కోల్కతాలోని డౌమండ్ హార్బర్లో శుక్రవారం రాత్రి జరిగింది.
సనా తన కారులో బెహలా చౌరస్తాలో వెళ్తుండగా.. కోల్కతా నుంచి రాయ్చక్ వెళ్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సమయంలో సనా డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి సనా, ఆమె డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారును ఢీకొట్టిన వెంటనే బస్సు వేగంగా ముందుకు వెళ్లగా.. కారు డ్రైవర్ దాన్ని వెంబడించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సును అడ్డగించి.. సనా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Leopard | ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల చిరుత.. వీడియో
Karnataka | పీసీసీ పీఠం నుంచి అవుట్.. డిప్యూటీ సీఎంకు కర్ణాటక ముఖ్యమంత్రి చెక్?