భువనేశ్వర్: అటవీ జంతువుల ప్రేమికులకు శుభవార్త. ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్ చిరుతపులి (Leopard) కనిపించింది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది. అడవిలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపులి కదలికలను గుర్తించామని ప్రినిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రేమ్ కుమార్ జా తెలిపారు.
అరుదైన నల్ల చిరుత సెంట్రల్ ఒడిశాలో కనిపించిందని, దాంతోపాటు పిల్ల కూడా ఉందని చెప్పారు. ఇది ఈ ప్రాంత అద్భుతమైన జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. పర్యావరణ వ్యవస్థకు నల్ల చిరుతలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. వాటి ఆవాసాలను రక్షించడమనేది అభివృద్ధి చెందుతున్న వన్యప్రాణుల వారసత్వాన్ని నిర్ధారిస్తుందని వెల్లడించారు.
#WATCH | Nayagarh, Odisha: Rare melanistic leopard spotted with cub in Odisha’s Nayagarh forest.
(Visuals Source: DFO) pic.twitter.com/HJKEOxU2BG
— ANI (@ANI) January 3, 2025