శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 13:07:16

వందేమాత‌రం.. మోదీ రాక వేళ సైనికుల నినాదాలు: వీడియో

వందేమాత‌రం.. మోదీ రాక వేళ సైనికుల నినాదాలు: వీడియో

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ ఇవాళ ఆక‌స్మికంగా లేహ్‌లో ప‌ర్య‌టించారు.  చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త నెల‌కొన్న నేప‌థ్యంలో.. ఆయ‌న నిమూ ఫార్వ‌ర్డ్ లొకేష‌న్‌లో సైనికుల‌ను క‌లుసుకున్నారు.  గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత స‌రిహ‌ద్దుల్లో వాతావ‌ర‌ణం టెన్ష‌న్‌గా మారింది. అయితే మోదీ ఇవాళ ఉద‌యం లేహ్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో.. సైనిక సోద‌రులు న‌వఉత్తేజంతో ఊగిపోయారు. ప్ర‌త్యేక ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో లేహ్‌కు చేరుకున్న మోదీకి సైనికులు స్వాగ‌తం ప‌లికారు. 

తొలుత ప్ర‌ధాని మోదీకి.. ఎయిర్ మార్ష‌ల్ నిర్దోష్ త్యాగి అక్క‌డి ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దు మ్యాప్‌ను మోదీకి వివ‌రించారు.  ప్ర‌ధాని మోదీ కూడా ఉద్రిక్తంగా ఉన్న స‌రిహ‌ద్దు అంశాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక సైనికుల మ‌ధ్య కాసేపు న‌డుచుకుంటూ వెళ్లారు.  ఆ స‌మ‌యంలో సైనికులు నినాదాలు చేశారు.  భార‌త్ మాతాకీ జై.. వందేమాత‌రం అంటూ సైనికులంతా గ‌ట్టిగా నినాదాలు చేశారు.  ప్ర‌తి ఒక సైనికుడికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ మోదీ ముందుకు సాగారు. 

logo