Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు (devotees) పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 40 కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకూ 39.74 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది.
Also Read..
Maha Kumbh Mela | మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం
Infosys | సాయంత్రంలోపు క్యాంపస్‌ను వీడండి.. ట్రైనీలకు ఇన్ఫోసిస్ అల్టిమేటం..!