Smriti Irani | అమేథి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన స్మృతి ఇరానీ
Smriti Irani | ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi) లోక్సభ స్థానానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) నామినేషన్ దాఖలు చేశారు.
Smriti Irani | ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi) లోక్సభ స్థానానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్కు కంచుకోటగా భావించే అమేథి నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఇరానీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా రెండోసారి కూడా ఆమె అమేథి నుంచి పోటీకి దిగారు. ఇందులో భాగంగా సోమవారం ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
అంతకు ముందు ఉదయం తన ఇంట్లో, స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, భర్త జుబిన్ ఇరానీతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు నేపథ్యంలో స్మృతి ఇరానీ ఆదివారం అయోధ్యలోని రామ మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ బాలరాముడిని దర్శించుకుని ఇవాళ నామినేషన్ వేశారు.
కాగా, గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోటీకి దిగి స్మృతి ఇరానీ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా బీజేపీ అమేథి నుంచి స్మృతి ఇరానీకే అకవాశం కల్పించింది. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. గతంలోలానే అమేథిలో ఈసారి కూడా రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా ప్రచారంలో వినిపిస్తోంది. దీనిపై మరో నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Uttar Pradesh: Union Minister and BJP candidate from Amethi, Smriti Irani files her nomination papers for #LokSabhaElections2024
Madhya Pradesh CM Mohan Yadav is also present.
Amethi will vote in the fifth phase of the Lok Sabha elections on May 20.
(Source:… pic.twitter.com/T7zaLxNqum
— ANI (@ANI) April 29, 2024
Also Read..
Smriti Irani | అమేథిలో స్మృతి ఇరానీ స్కూటర్ రైడ్.. ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్ర మంత్రి
Amit Shah | ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం.. ఎఫ్ఐఆర్ నమోదు
Rajnath Singh | లక్నో లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

