Health Tips | వాకింగా.. రన్నింగా.. ఏది బెస్ట్?
గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాయామాల ప్రస్తావన వస్తే... ఎక్కువమంది ఎంపిక రన్నింగ్ లేదా వాకింగ్ అయ్యుంటుంది. అంతగా ప్రాచుర్యం పొందిన సులువైన వ్యాయామాలు ఇవి. ఈ రెండూ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Health Tips | గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాయామాల ప్రస్తావన వస్తే… ఎక్కువమంది ఎంపిక రన్నింగ్ లేదా వాకింగ్ అయ్యుంటుంది. అంతగా ప్రాచుర్యం పొందిన సులువైన వ్యాయామాలు ఇవి. ఈ రెండూ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఏది మంచిదంటే మాత్రం మన అవసరాలకు తగినట్టుగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ముందుగా దేనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలి.
- వాకింగ్
రోజువారీగా సులువుగా చేసే వ్యాయామాల్లో నడక ఒకటి. వేగంగా నడిచే బ్రిస్క్ వాక్ అయినా, పార్కుల్లో విశ్రాంతిగా నడిచినా దేని ప్రయోజనాలు దానికి ప్రత్యేకం.
కీళ్లకు మంచిది: రన్నింగ్‌లా కాకుండా వాకింగ్ కీళ్ల మీద తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవాళ్లకు నడక మంచి ఎంపిక.
ఎవరైనా సరే: వయసు, ఫిట్నెస్ స్థాయులతో సంబంధం లేకుండా అందరూ నడవగలరు. కాబట్టి, వ్యాయామం కొత్తగా మొదలుపెట్టేవాళ్లు వాకింగ్‌తో ప్రారంభించడం మంచిది. ఇంకా గాయాల నుంచి కోలుకుంటున్న వారికైనా వాకింగ్ ఉత్తమ వ్యాయామంగా నిలుస్తుంది.
గుండెకు అండ: రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయులు సమతూకంలో ఉంటాయి.
మానసిక ఆరోగ్యం: వాకింగ్ వల్ల ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు మొదలైనవి తగ్గుతాయి. మూడ్, మెదడు పనితీరు మెరుగుపడతాయి.
బరువు నిర్వహణ: రన్నింగ్ అంత కాకపోయినప్పటికీ శరీరంలో అధికంగా పేరుకున్న క్యాలరీలను కరిగించడంలో వాకింగ్ ఎంతోకొంత సాయపడతుంది. నడకకు ఆరోగ్యకరమైన ఆహారం తోడైతే శరీర బరువు తగ్గించుకోవచ్చు.
- రన్నింగ్
వాకింగ్‌తో పోలిస్తే రన్నింగ్ కొంచెం తీవ్రమైన వ్యాయామం కిందికి వస్తుంది. దీని ప్రయోజనాలు దీనికి ఉన్నాయి.
క్యాలరీలు కరుగుతాయి: వాకింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. అలా అధిక బరువు వదిలించుకుని, ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడానికి రన్నింగ్ ఉత్తమమైన మార్గం.
గుండె ఆరోగ్యానికి: ఓ మోస్తరు నుంచి కొంచెం తీవ్రమైన రన్నింగ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. అలా శ్వాస వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది.
ఎముకల దారుఢ్యానికి: రన్నింగ్ ఎముకల పెరుగుదల, వాటి సాంద్రతను ప్రేరేపిస్తుంది. ఎముకల దారుఢ్యాన్ని పెంచి ఆస్టియో పొరోసిస్ ముప్పును తగ్గిస్తుంది.
ఒత్తిడి నిర్వహణలో: నడకలోలాగే రన్నింగ్ కూడా శరీరంలో ఎండార్ఫిన్ల విడుదలకు కారణమవుతుంది. ఇవి ఒత్తిడిని తరిమేస్తాయి. మూడ్‌ను మెరుగుపర్చి ఉపశమనాన్ని ఇస్తాయి.
సమయం కలిసొస్తుంది: వాకింగ్‌తో పోలిస్తే అవే ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రన్నింగ్‌తో తక్కువ సమయం పడుతుంది. అలా బిజీగా ఉండేవాళ్లకు రన్నింగ్ ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది.
- ఏది మంచిది?
ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వ్యక్తిగత అభిరుచులు, ఫిట్నెస్ లక్ష్యాలు, శారీరక సామర్థ్యాన్ని బట్టి వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే మొదలుపెట్టేవాళ్లు, కీళ్లనొప్పులు ఉన్నవాళ్లకు నడక మంచి ఎంపిక. ఇక క్యాలరీలు ఎక్కువగా కరిగించుకోవాలని అనుకుంటే మాత్రం రన్నింగ్‌ను ఎంచుకోవచ్చు. అయితే, రన్నింగ్‌ను నెమ్మదిగా ఆరంభించాలి. శరీరానికి గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్నెస్ నిపుణుడిని సంప్రదించిన తర్వాతే ఏ వ్యాయామాన్ని అయినా మొదలుపెట్టడం మంచిది. ఎక్కువ కాలంపాటు చేయగలిగే వ్యాయామాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం సొంతం చేసుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

