హాపుర్: ఉత్తరప్రదేశ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రజ్ఘాట్ టోల్ ప్లాజా వద్ద ఓ కారు(Car Crash) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరు మంది మృతిచెందారు. ఓ ట్రక్కును కారు ఢీకొన్నది. సోమవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. అదుపు కోల్పోయిన కారు డ్రైవర్ తన వాహనంతో ట్రక్కును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డవారిని మీరట్ ఆస్పత్రిలో చేర్పించారు. అర్థరాత్రి 12.30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు ఎస్పీ అభిషేక్ వర్మ తెలిపారు.