Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. బుధవారం ఉదయం కూడా ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 400కిపైనే నమోదవుతోంది. గాలి నాణ్యత ఈ సీజన్లో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 438గా నమోదైంది. బావనాలో 451, చాందినీ చౌక్ ప్రాంతంలో 449, ద్వారకా సెక్టార్-8లో 423, ఐటీవోలో 433, ముంద్కాలో 443, నరేల ఏరియాలో 437, రోహిణి ప్రాంతంలో 442తో ప్రమాదకరస్థాయిలో నమోదైంది.
గాలి నాణ్యత ఈ సీజన్లో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి కాలుష్యంపై గత ప్రభుత్వాలను నిందించిన బీజేపీ నాయకులు.. ఇప్పుడు మాట్లాడటం లేదేంటని నగరవాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. కాలుష్యానికి తోడు దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఊపిరాడటం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
Delhi Blast | పేలుడుకు ముందు.. కన్నౌట్ ప్లేస్, మయూర్ విహార్లో సంచరించిన ఐ20 కారు