Rahul Gandhi | ఓట్ల చోరీ (vote chori) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ (BJP), కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటరు జాబితాను సవరించి, పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ‘ఓట్ అధికార్ యాత్ర’ పేరుతో యాత్ర చేపడుతున్నారు.
ఈ యాత్ర రెండో రోజు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా (new weapon) అభివర్ణించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసిన వారిని ప్రస్తుత జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ సూత్రాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈమేరకు తన వాట్సప్ ఛానల్లో పోస్టు పెట్టారు.
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది ఓట్ల చోరీకి కొత్త ఆయుధం. దీనికి ఆధారమే ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు. వారంతా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. కానీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి వారి గుర్తింపు, ఉనికి భారత ప్రజాస్వామ్యం నుంచి తుడిచిపెట్టుకుపోయింది’ అని రాహుల్ గాంధీ తన పోస్టులో రాసుకొచ్చారు. బీహార్‌లో SIR చర్యల తర్వాత తమ పేర్లను ఓటర్ల లిస్టు నుంచి తొలగించినట్లు వారు తనతో చెప్పినట్లు రాహుల్ గాంధీ తన వాట్సాప్ ఛానెల్లోని పోస్ట్‌లో తెలిపారు. వారి పేర్లను కూడా అందులో ప్రస్తావించారు.
Also Read..
Impeachment Motion: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం !
Naveen Patnaik | ఆస్పత్రిలో చేరిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్.. వైద్యులు ఏమన్నారంటే..?
Army Jawan | ఆర్మీ జవాన్‌ను పోల్‌కు కట్టేసి కర్రలతో దాడిచేసిన టోల్ సిబ్బంది.. వీడియో