న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై ఓట్ చోరీ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం(Impeachment Motion) ప్రవేశపెట్టాలని విపక్షాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఈసీ జ్ఞానేశ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రెండో వంతు మెజారిటీ ఉంటే ఆ ముసాయిదాపై ఉభయ సభల్లోనూ ఆమోదిస్తారు. ఇక ఆ తీర్మానం ప్రవేశపెట్టేందుకు దానిపై కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంటుంది.
ఇండియా బ్లాక్‌కు చెందిన ఫ్లోర్ లీడర్లు ఇవాళ సమావేశం అయిన తర్వాత అభిశంసనపై నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఇవాళ కూడా ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బీహార్‌లో జరిగిన సిర్ ప్రక్రియపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఒకవేళ ప్రభుత్వ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే అప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు.