Army Jawan | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ (Army Jawan)పై టోల్గేట్ సిబ్బంది (Toll Booth Staff) విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన మీరట్ (Meerut)లోని భూని టోల్గేట్ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజ్‌పుత్ రెజిమెంట్ (Rajput Regiment)లో సైనికుడిగా పని చేస్తున్న యూపీకి చెందిన కపిల్ కవాడ్ (Kapil Kavad) అనే వ్యక్తి వరుస సెలవులు కావడంతో సొంతూరికి వెళ్లారు. సెలవులు ముగించుకొని ఆదివారం రాత్రి శ్రీనగర్‌కు తిరిగి బయల్దేరారు. ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరాడు.
అయితే, రద్దీ కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనం మీరట్‌లోని భూని టోల్గేట్ ( Bhuni toll plaza) వద్ద చిక్కుకుపోయింది. ఫ్లైట్‌కు టైమ్ అవుతుండటంతో.. కపిల్ కారు దిగి ఆలస్యంపై టోల్ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ క్రమంలో కపిల్, టోల్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన టోల్ సిబ్బంది జవానుపై దాడి చేశారు. స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దాడి దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరోవైపు సమాచారం అందుకున్న మీరట్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జవాను కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీడియో ఆధారంగా నలుగురు టోల్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సిబ్బంది దాడిలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
🚨मेरठ : टोलकर्मियों ने सेना के जवान को बुरी तरह पीटा🚨
🆔 कश्मीर ज्वाइनिंग को जा रहा जवान जाम में फंसा था
🚧 टोल प्लाजा पर लंबे जाम को लेकर जवान ने किया विरोध
👊 विरोध करने पर टोल कर्मियों ने की जवान की पिटाई
💥 टोल प्लाजा पर सादे कपड़ों में रहता है गुंडों का जमावड़ा
🇮🇳 कोटका… pic.twitter.com/V6VEUcQcoG— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 17, 2025
Also Read..
Air India | చివరి నిమిషంలో విమానం టేకాఫ్ రద్దు.. రన్‌వే నుంచి జారినట్లైందంటూ ఎంపీ పోస్ట్
Shubhanshu Shukla | నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్ హీరో శుభాన్షు శుక్లా
Bomb Threat | పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్