Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబు బెదిరింపులు (Bomb Threat) మరోసారి కలకలం రేపాయి. సోమవారం ఉదయం నగరంలోని పలు విద్యాసంస్థలకు (Delhi Schools) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని రెండు పాఠశాలలు, ఓ కళాశాలకు (college) ఇవాళ ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈమెయిల్ ద్వారా ఆయా విద్యాసంస్థలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సోమవారం ఉదయం 7:24 గంటల సమయంలో బాంబు బెదిరింపులకు సంబంధించిన సమాచారం తమకు అందినట్లు ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. సమాచారం రాగానే ఢిల్లీ పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆయా విద్యాసంస్థల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాలలు, కళాశాల ప్రాంగణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, గత నెల ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. జులై 18న బెంగళూరులోని 40 స్కూల్స్, ఢిల్లీలోని 45 ప్రైవేట్ పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు అవన్నీ బూటకపు బెదిరింపులుగా తేల్చారు. ఇలా వరుస బెదిరింపులతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read..
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులే లక్ష్యంగా మందుపాతర.. జవాన్ మృతి
US Secretary | భారత్, పాకిస్థాన్‌పై రోజూ ఓ కన్నేసి ఉంచుతాం.. ఎందుకంటే..!
చైనాలో నిరుద్యోగ కార్యాలయాలు.. ఉద్యోగం లేకున్నా ఉన్నట్టు నటించొచ్చు