US Secretary : భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను అమెరికా పాత్ర లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా సరే ఆ దేశం మాత్రం అంగీకరించడం లేదు. దాయాది దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదే పదే అంటున్నారు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టు అమెరికా సెక్రటరీ మార్కో రూబియో (Marco Rubio) సైతం ఆయనకు వత్తాసు పలికారు. ఆదివారం ఎన్బీసీ న్యూస్‌తో మాట్లాడిన ఆయన.. భారత్, పాకిస్థాన్‌పై అమెరికా ప్రతిరోజూ ఓ కన్నేసి ఉంచుతుందని తెలిపారు.
‘భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉంది. ఇరుదేశాలను అణుయుద్ధానికి వెళ్లకుండా అడ్డుకున్నాం. పరస్పర దాడుల సమయంలో ఇరుదేశాలను నియంత్రించడం మాకు సవాల్‌గా, ఎంతో కష్టంగా మారింది. అందుకే.. భారత్, పాక్‌లు ఎటువంటి చర్యలకు సిద్దమవుతున్నాయో తెలుసుకునేందుకు అమెరికా ప్రతిరోజు దాయాది దేశాలపై ఓ కన్నేసి ఉంచింది’ అని రూబియో వెల్లడించారు. ఇక రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు పుతిన్, ఇటు జెలెన్సీని ఒప్పించి కాల్పులు ఆపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. కానీ తమ ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చిందని యూఎస్ సెక్రటరీ పేర్కొన్నారు.
‘Ceasefire has to be maintained, which is very difficult. The U.S keeps an eye on what is happening between India and Pakistan every single day,’ says Marco Rubio on NBC.
This is a big admission & Munir starting another skirmish is a possibility. pic.twitter.com/d81LPNrjnH
— Atishay Jain (@AtishayyJain96) August 17, 2025
‘రష్యా, ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ త్వరగా జరగనుంది. ఎందుకంటే దాదాపు మూడున్నర సంవత్సరాలుగా సాగుతున్న యుద్దం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అందుకే.. సీస్‌ఫైర్‌కు ఇరుదేశాధి నేతలు అంగీకరిస్తారనడంలో నాకు సందేహం లేదు. అయితే.. రష్యా, ఉక్రెయిన్లు పూర్తిగా కాల్పులు విరమణ పాటించాలని అమెరికా కోరడం లేదు. కానీ, ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలని భావిస్తున్నాం. దాంతో, ఇకపై రెండు దేశాల మధ్య యుద్ధం జరగదు. భవిష్యత్తులోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాదు’ అని రూబియో వెల్లడించారు.
పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణులతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది సైన్యం. అంతేకాదు పాక్ సైనిక విమానాలను, డ్రోన్లను కూల్చేసి పైచేయి సాధించింది భారత్. ఊహించని నష్టంతో భీతిల్లిన పాక్ మా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ, భారత సైన్యం పరాక్రమానికి చివరకు కాళ్ల బేరానికి వచ్చి.. యుద్ధం ఆపడంటూ మొరపెట్టుకుంది. దాంతో, ఇరుదేశాల డీజీఎంవోలు మాట్లాడుకొని మే 10వ తేదీన కాల్పుల విరమణకు అంగీకరించారు.